శ్రీ పార్వతీపరమేశ్వర కల్యాణ వైభవము
గ్రంథ గ్రథన కర్తా:
ములుకుట్ల నరసింహావధానీ శర్మా పాకయాజీ గారు
***
శ్రీ స్కాందాది సర్వపురాణ సంహితా నిగమాగమ ప్రతిపాదిత
శ్రీ పార్వతీ పరమేశ్వర కల్యాణ వైభవము
----
శివప్రసన్నాత్మక ప్రథమ సర్గము
నానా పురాణ నిగమాగమ సార భూతౌ
నానా విధాత్మక సుపుణ్యద నామ రూపౌ
నానా వ్రతక్రతు సుతపోధన సుప్రసన్నౌ
గౌరీశివౌ మమ సదా హృది సన్నిదత్తామ్||
౧. సర్వ పురాణేతిహాస నిగమాగమ సార భూతులును, అనేక విధములగు పుణ్య మొసగెడి నామ రూపములు గలవారును, తపోదమ సర్వక్రతు నియమాదులచే ప్రసన్నులగు సాక్షా త్పార్వతీ పరమేశ్వరులు ఎల్లప్పుడును నా హృదయమున నెడబాయక నివసింతురు గావుత!
౨. అట్టి గౌరీ శంకరులు కార్య కారణముల వలె, ఆదిత్యా తపములవలె వస్తువాచకముల వలె బ్రహ్మాత్మ భావముననేక స్వరూపులు. వారే జీవాత్మ ప్రకృతి భావముచే చెప్పబడుదురు. అట్టి శివా శివులకు నిత్యము నమస్కారము గావింతును.
౩. ఈ ప్రపంచ మందెందరు దేవతలు లేరు. వారిలో నొకరైనను మోక్షమొసగువారు బొత్తిగా లేరు. సదాశివుడు మాత్రము యిహ పరముల నొసగును. కావున పరమేశ్వరుడే దాత యని శ్రుతి పల్కెను.
౪. ఒకప్పుడు పాపరహితమును, దేవభూమి యగు నైమిశారణ్య మందు శౌనకాది మహర్షులకు సూతమహర్షి శ్రీ రామాయణమును షట్కా౦డలును వినిపించి మరల వారితో నిట్లు పలికెను.
౫. ఓ మహర్షులారా! ఈ విధమన నిరంతరమును కైలాసమందు పరమేశ్వరునిచే పార్వతీదేవి రామాయణమును వినుచుండును. ఇప్పుడును అట్టి రామాయణ ప్రవచన శ్రవణములు జరుగుచునే యున్నవి. కాని ఆమె పూర్వము దక్షపుత్రిక యగు సతీదేవి ప్రస్తుతము పార్వతీ దేవి యనబడుచున్నది అని చెప్పెను.
౬. అదివిని మునులిట్లు ప్రశ్నించు చున్నారు – దక్షుని చరితమును సతీదేవి యాతని కూతురుగ తపోమహిమచే పుట్టుటయు తుదకామెయే ప్రస్తుతము హిమవంతునికి పార్వతి యనుపేర కుమార్తెగా నవతరించెనని మాత్రమే సంగ్రహముగ వింటిమి. కాని –
౭. ఆ జగజ్జనని పర్వత రాజున కెట్లు సంభవించెనో, ఆమెకు శివానుగ్రహ మెటుల కలిగెనో, విరక్తుడగు శివునకును, ఆమెకును కల్యాణము సంఘటింపజేసిన దెవరో ఆ కల్యాణ వృత్తాంత మంతయును మాకు మీరనుగ్రహింపుడు, ఏలయన –
౮-౧౦. సూతమహర్షి యిట్లు చెప్పుచున్నాడు -
శ్రీ శివ పార్వతీ కళ్యాణ కథ కొనసాగించవలసినదని మనవి.
రిప్లయితొలగించండి