శ్రీ రామ జయ రామ జయ జయ రామ

29, అక్టోబర్ 2011, శనివారం

సమస్యాపూరణం- నవంబర్ 2011

నన్నయ, తిక్కన, పోతనార్యులకు, అచ్చతెలుగు కవి పండితాళికి క్షమాపణలతో, ఈ నాటి పూరణ వ్యాజస్తుత్యలంకారంగా:

“నన్నయార్యుడప్పటి వేగినాట వాడు (కోస్తా)
తిక్కనట సింహపురివాసి తెలియు నెటుల? (రాయలసీమ)
పోతన మనవాడగు నేమి, పొరుగు వాడు (తెలంగాణా)
వార లేమైన నాకేమి వరుస గట్ట?
నాది నావూరు నాజిల్ల నాకు గొప్ప
నే పలికెడిది మాత్రమె నిట్ట తెలుగు”

ఇట్టి స్వార్థ చింతన మనకెట్లు గలిగె
వారలూహించి యుండని దారుణమిది
తెలుగు వారల బ్రతుకులు తెల్ల వారె
తెలుఁగు కల్పవృక్షమునకు తెగులు పట్టె!

5 కామెంట్‌లు:

  1. శనిOct29: కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే
    దుర్యోధనుడు శ్రీకృష్ణునితో అన్న మాటలు:
    (జానామి ధర్మ౦ న చ మే ప్రవృత్తి:
    జానామ్యధర్మ౦ న చ మే నివృత్తి: ...)
    నా పూరణ:
    అందు నధర్మము తెలియును
    కుందగుబో, పుట్టుగుణము కొరతల నోర్తున్
    మందుడ కృష్ణా! చూడగ
    కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే.
    ఇంకొక పూరణ:
    అందొక సమస్యఁ గంటిని
    కుందేటికిఁ గొమ్ములాఱు కుక్కకువలె నే
    నందముగ, నేడిది యెటుల
    కుందేటికి మూడు కాళ్ళు కుక్కకు వలెనే??

    రిప్లయితొలగించండి
  2. శుక్ర-Oct28: జనులకు భగినీ హస్తభోజనము విషము
    ఆడపడుచింటి కూటికి నాశపడకు
    వత్సరమున కొకపరినా వరుస కొరకు
    గతుక వారింట మరియాద, కాని యెడల
    జనులకు భగినీ హస్తభోజనము విషము!

    రిప్లయితొలగించండి
  3. గురు oct27: ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్
    ధేనుక ధారల శత్రులఁ
    దీనులుగ మలచిన ఖడ్గతిక్కన శూరున్
    కానగబ్రాహ్మణుడగుబో
    ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్.

    బుధ-oct 26:దీపావళి పోరు సలిపె తిమిరముతోడన్ (empty)

    మంగళ-oct25: నరకునకు సత్యభామ సోదరి యగునఁట!(empty)

    సోమ-oct24: సొమ్ము లున్నవాఁడె సుగుణధనుఁడు
    ఉన్నసొమ్ము లూడ్చె నొసగ నింద్రపదవి (బలికి)
    లేనిసొమ్ములిచ్చె తా నడగక (కుచేలునికి)
    వాని లీల లందు వాని మెప్పించెడి (వాడు=పరమాత్మ)
    “సొమ్ము” లున్నవాఁడె సుగుణధనుఁడు.

    Sun-Oct23: నేనే నీవైతినేమొ? నీవే నేనో?

    రిప్లయితొలగించండి
  4. Oct30: భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె.
    తే.గీ.లో పూరణ:
    అచలజ శివప్రసన్నార్ధి యగుచు నిత్య
    విధుల నతనికి పూమాల వేయ జూడ
    నంత పంచ బాణము లేయ నంగ భవుఁడు
    భవు నెదిర్చి భంగపడఁడె భవ్య రీతి ?

    రిప్లయితొలగించండి
  5. Oct31, 2011: అల్లుఁ డవినీతిపరుఁ డైన నత్త మెచ్చు(empty)

    రిప్లయితొలగించండి