భాష యొక్క పుష్టి, సొగసు, ఒక భావనని ఎన్ని
రకాలుగా ఎంత అందంగా వ్యక్తీకరించవచ్చు అనేదాని బట్టి ఉంటుందేమో! ఆ విషయంలో
సంస్కృతం, తెలుగు పోటీ పడుతున్నాయా అనిపిస్తుంది. ఉపమా కాళిదాసస్య అన్నమాట మనకి
తెలిసిందే.
ఒక ఉదాహరణ: మనం సాధారణంగా ఎవరైనా వ్యర్ధమైన పనులు
చేస్తున్నపుడు, సామెతగా “చెవిటివాడి
చెవిలో శంఖం ఊదినట్లుగా” అంటూ ఉంటాం. ఆ భావనకే నా సాహిత్యాభిలాష లోంచి వచ్చిన ఇంకొన్ని చూద్దాం.
- గుడ్డివానికి అద్దంబు చూపినట్లుగా
- అపాత్రునకిచ్చిన దానంబు తెన్నుగా
- ఊసర క్షేత్రంబున విత్తులు జల్లినట్లుగా
- అజీర్ణ రోగికి పంచభక్ష్య పరమాన్నమిడినట్లు
- అవివేకిని సేవించిన కరణి
- అస్వతంత్రుని బీరంబులాగున
- అ-రసికుని కడ ప్రదర్శించిన కళల తెరంగున
- కృతఘ్నునికి చేసిన సదుపదేశంబు భంగి
- బోసినోటికి చెరకు ముక్కలందించినట్లు
- వృద్ధు వివాహ మాడినట్లు
=========== =
సీతారాములు జీవాత్మ పరమాత్మ సదృశులు.
పరమార్థ సాధన కోసం తపించే అద్వైత ప్రేమ మూర్తులు, మనకి శ్రీ రామాయణం లో కనిపించే
భార్యా భర్తలు.
భావం బలంగా ఉండాలే గానీ చిన్ని తేటగీతి
పద్యం లోనయినా గొప్పగా చెప్పవచ్చు అనేదానికి తార్కాణం... వీరి బంధాన్ని
కల్పవృక్షంలో విశ్వనాధ వారు వర్ణించిన తీరు ఎంత గొప్పగా ఉందో చూడండి.
సీత శ్రీ రామ చంద్రుని చిత్తపదము
రామ చంద్రుడు జానకీ ప్రాణప్రదము
రామ సర్ప ఫణామణి రమణి సీత
ధరణిజా జీవితాతప తరణి స్వామి
తాత్పర్యం: సీత చిత్తమందు శ్రీ రాముడున్నాడు.
రాముని ప్రాణము సీత. శ్రీ రామ మనే సర్పపు పడగపై
నుండే దివ్యమణి సీత. సీతాదేవి జీవిత ప్రకాశకము రాముడనే సూర్యుడు.
=============== =
=============== =
Jan 2, 2019:
విశ్వనాధ సత్యనారాయణ గారు తన personality
గురించి తానే వ్రాసుకొన్న పద్యం చూడండి. తమ కులదైవమైన నందమూరు విశ్వేశ్వరస్వామి తో
మొరపెట్టుకొంటునట్లుగా. అలా
వ్రాసుకోవటానికి gutts ఉండాలి.
పద్యం:
మాట దురుసు చేసినావు, చేసితి మనసు
మెత్తనగ,
బాట తప్పించితి బ్రదుకు, పుట్టెఁడు ప్రతిభ
నిచ్చితివి
కోటి శత్రుల కూర్చినావు, కూర్చుంటి గుండియ లోన
నాటగా, నందమూర్నిలయ విశ్వేశ్వరా
కులస్వామి!
బహుశ: అలాంటి ప్రతిభా మూర్తులే అంత
నిష్కల్మషముగా ఉండగలరేమో! వాళ్లకి ఎవరో ఎదో అనుకొంటారేమో అనే ధ్యాస ఉండదేమో!
అందుకే అంత ధైర్యంగా మాట్లాడగలరు, అలానే ఉండగలరు.
======== =
======== =
డిసెంబర్
21, 2018:
కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన!
మా
కర్మ ఫల హేతుర్భూ: మా తే సంగోzస్త్వ కర్మణి!!
నా స్వేచ్చానువాదం కంద పద్యంలో :
కర్మ
లొనరించుటె నీ
ధర్మ
మనుము, ఫలమునందు తలపు వలదుబో
కర్మ
విడనాడ బోకుము
మర్మమెరుగుము,
ఫలమిచ్చు మాధవుడను నే !
భాగవత పద్యాలు సులువుగా ఎలా నేర్చుకోవాలి ? మీతో పాటు చిన్నపిల్లలకు కూడా పద్యాలూ ఏవిధంగా నేర్పించాలో వివరించడం జరిగింది. భాగవతం లోని కొన్ని ముఖ్యమైన పద్యాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఎదురుగా ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే , పూర్తీ పద్యం , ప్రతిప్రదార్ధం , భావం , ఎలా పడాలో ఆడియో కూడా ఇవ్వడం జరిగింది.
రిప్లయితొలగించండి1. పలికెడి భాగవతమట : https://goo.gl/TiB6aG
2. భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు : https://goo.gl/NiXoVU
3. చేతులారంగ శివుని బూజింపఁడేని : https://goo.gl/3J5MFL
4. చదివించిరి నను గురువులు : https://goo.gl/KjU5a7
5. చిక్కడు వ్రతముల గ్రతువుల : https://goo.gl/wdy7Ai
6. ఇందు గలడందు లే డని : https://goo.gl/UW5Lye
7. శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ : https://goo.gl/K4XMf7
8. లోకంబులు లేకేశులు : https://goo.gl/hZY1jv
9. కల డందురు దీనుల యెడ : https://goo.gl/MRKBwM
10. కలుగఁడే నాపాలి : https://goo.gl/5MqTFP
11 లా వొక్కింతయు లేదు : https://goo.gl/XKDcnF
12 ఓ! కమలాప్త! : https://goo.gl/Hyn1hF
13 అల వైకుంఠపురంబులో : https://goo.gl/yiRvBN
14 సిరికిం జెప్పఁడు : https://goo.gl/Pm37xk
15 తనవెంటన్ సిరి : https://goo.gl/MUXPHq
16 అడిగెద నని కడువడిఁ జను : https://goo.gl/HwQ5LX
17 మకర మొకటి రవిఁ జొచ్చెను; https://goo.gl/j8fG8w