శ్రీ రామ జయ రామ జయ జయ రామ

7, నవంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణములు-నవంబరు, 2010

సమస్య: ధూమశకట మెక్కి రాముఁ డేగె (Nov 05)
రామగిరి నివాసి రమణు(డా యక్షుడు
ధూమశకట మెక్కి రాముఁ డేగె,
ఊహల యలకపురి కాహితప్రేయసి
గనుగొన, యెడబాటు కష్టమె కద !




సమస్య: బారును సేవించి మంచి బాటను బట్టెన్ (నవంబరు ౦౨, ౨౦౧౦)
చేరి కమఠమది కొంగల
బారును సేవించి మంచి బాటను బట్టెన్
జోరుగ నెగిరెడి వేళ
న్నూరక నోరెత్తి దండె మొదిలి ధరబడెన్!


సమస్య: నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యె (నవంబరు ౦౧, ౨౦౧౦)
తా తప్పెరింగిన బలి య (అ)
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యె
న్నంత హరి యనుగ్రహమున
నీతడు సావర్ణి మనువగు నిక్కము వింటే!

6 కామెంట్‌లు:

  1. సమస్య: పొట్టివాఁడె కాని గట్టివాఁడు !
    ఆణి ముత్యమువలె బాణి నందించెను
    "జై జవాను బోలొ జైకిసాను !”
    లాలు బహదురు ఘనులా శాస్త్రిజీ చూడ
    పొట్టివాఁడె కాని గట్టివాఁడు !

    రిప్లయితొలగించండి
  2. ఈటె పోటులు యిట్టె మాన్పించ గలము
    సూటి పోటిమాటలు చుచ్చిచుచ్చి చంపు
    మాట పోటుకి లేదురా మందు, కనగ
    ఈటెలే మేలు బాధించు మాటకంటె.

    రిప్లయితొలగించండి
  3. పద్మజా శర్మ17 నవంబర్, 2010 6:59 AMకి

    భాష నెంగిలి చేష్టల భ్రష్ట పరచి
    భావ లేమియె తమకును బలము యనుచు
    తీరు తెన్నులు గానక తిరుగు వారి
    రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె
    దానిఁ తలకు రోకలిజుట్టు దండు మెచ్చె,
    వారి లోకమ్ము వారిది, వద్దు మనకు !

    రిప్లయితొలగించండి
  4. భాష నెంగిలి చేష్టల భ్రష్ట పరచి
    భావ లేమియె తమకెంతొ భద్ర మంచు
    తీరు తెన్నులు గానక తిరుగు వారి
    రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె
    దానిఁ తలకు రోకలిజుట్టు దండు మెచ్చె,
    వారి లోకమ్ము వారిది, వద్దు మనకు !

    రిప్లయితొలగించండి
  5. చంద్రశేఖర్ చెప్పారు...
    తమాషాగా, పూరణ:
    వరసన విషయము లేకన్
    సరసము విరసము కొరకని సాకులు చెప్పెన్
    కరివంటిమగడు, హతవిధి !
    సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్!

    రిప్లయితొలగించండి
  6. మీకు సమస్యా పూరణలకి ఐడియాలు ఎలా వస్తాయి సారూ!

    రిప్లయితొలగించండి