శ్రీ రామాయణ కల్పవృక్షం మీద కొందరు తుంటరి వాళ్ళు "మళ్ళా రామాయణం వ్రాయటం ఏమి గొప్ప. ఇప్పటికి వంద రామాయణాలకి పైగా వచ్చాయి" అన్నారు. అట్లాంటి వాళ్లకి విశ్వనాధ సత్యనారాయణ గారి సమాధానం ఎంత లోతుగా, ఆలోచింపజేసేట్లుగా ఉన్నదో చూడండి.
సీసపద్యం:
మఱల నిదేల రామాయణం బన్నచో
నీప్రపంచక మెల్ల నెల్ల వేళఁ
దినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు
తన రుచి బ్రతుకులు తనవి గాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనది గాన
తలఁచిన రామునే తలఁచెద నేనును
నా భక్తిరచనలు నావి గాన
తే.గీ.
కవి ప్రతిభలోన నుండును కావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి.
సీసపద్యం:
మఱల నిదేల రామాయణం బన్నచో
నీప్రపంచక మెల్ల నెల్ల వేళఁ
దినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు
తన రుచి బ్రతుకులు తనవి గాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనది గాన
తలఁచిన రామునే తలఁచెద నేనును
నా భక్తిరచనలు నావి గాన
తే.గీ.
కవి ప్రతిభలోన నుండును కావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి