సంక్రాంతి శుభాకాంక్షలు!
నా ఆటవెలది, మీకు శుభాకాంక్షలు తెలుపుతూ::
పౌష్యలక్ష్మి వచ్చె పండుగే పండుగై
భోగి నేడు మనకు యోగదాయి
సౌరమాన మకర సంక్రాంతి మరునాడు
భోగ భాగ్య మిచ్చు భూసురులకు!
జయ జయోస్తు మీకు చంద్రశేఖర కృపన్
మేటి కనుమ నేడు మేలు గలుగ
కక్క ముక్క తినర కనుమ నాడు, కాదుబో
గారెలైన తినుము ఘనముగాను!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి