భగవద్గీత శ్లోకము:
శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్ఠితాత్|
స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః|| (కర్మ యోగము 3-35)
తాత్పర్యం: చక్కగా అనుష్ఠి౦పబడిన పర ధర్మము కంటే, విగుణముగా (విభిన్న గుణము కలది) అనుష్ఠి౦పబడిననూ స్వధర్మమే శ్రేష్ఠము. పరధర్మ మందు బ్రతుకుట, మరియు దాని ఆచరణ, అనుకరణ ఎల్లప్పుడూ భయకారణమే. స్వధర్మమును పాటించుచూ దానియందే మరణించుట మేలు
నా స్వేచ్చానువాదం తేటగీతి పద్యంలో :
పరుల ధర్మము తగురీతి పలికిన దగు
బో, వలదు మనకు, భయము కలిగించు,
విగుణ మైనను, స్వధర్మ విహితకర్మ
మేలు, మరణహేతువగుబో మిక్కుటంబు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి