శ్రీ రామ జయ రామ జయ జయ రామ

20, మార్చి 2011, ఆదివారం

సమస్యాపూరణములు


10 కామెంట్‌లు:

  1. వీచిక: ఈరోజు ఫాల్గుణ పూర్ణిమ (హోళికా పున్నమి). నా స్వప్న సుందరి కి ప్రేమాంకితము:

    నిండు పున్నమి జాబిలి నిగిడి మెరయ
    నరవిరసిన మొగలిపూలు హాయి గొల్ప
    నాదు కలలరాణి వలపు నాట్య మందు
    వెన్నెలే తెల్లఁబోయిన వింతఁ గనుఁడు!

    రిప్లయితొలగించండి
  2. హరిఁజేర పాపులెందరొ
    నరసింహుని పూజ చేసె,నరకాసురుఁడే
    మరలనరుదెంచి వేడన్
    శరణాగతి,యజితుఁడొసఁగు సద్యోముక్తిన్!
    మనవి: నరకాసురుడు ఘోరపాపి. భూదేవి ఆతని పాపభారం మోయలేక పుత్రశోకాన్నైనా భరించటానికి సిద్దపడింది. అటువంటి పాపినయినా శరణాగతి వెడితే హరి క్షమించి ముక్తిని ప్రసాదిస్తాడనే భావము.

    రిప్లయితొలగించండి
  3. చంద్రశేఖర్23 మార్చి, 2011 8:49 AMకి

    నేను సమస్యని యదాతథముగా పూరించటానికి ప్రయత్నిస్తాను.అయోధ్యాకాండ,ముప్పైవ సర్గలోని శ్లోకమే ప్రేరణ:
    శ్లో. కిం త్వా మన్యత వైదేహ: పితామే మిథిలాధిప:
    రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహమ్.
    తాత్పర్యము: సీతాదేవి రామునితో అంటున్నట్లు: నాథా, నన్ను వెంటతీసుకొని పోవటానికి ఘోరారణ్యం, పులులు, సింహాలు వుంటాయని భయపడుతున్నావా? మా జనకుడేమను కొనునో తెలుసా, మా అల్లుడు పురుష రూపములో నున్నస్త్రీయే!అని.
    మనవి: ఈ శ్లోకానికి పండితులు చాలా ప్రాముఖ్యం ఇస్తారు.
    నాపద్యం:
    ఘోరాటవి,రావల దన,
    శ్రీరామునిఁ జూచి సీత చీకొట్టెఁ గదా
    ఔరా!నాజనకుఁడనును
    నా రాముడు పురుష రూప నారియట౦చున్!

    రిప్లయితొలగించండి
  4. చంద్రశేఖర్ చెప్పారు...
    హమ్మ గురువుగారూ, మీకు ఇన్ని పేర్లు తెలుసనుకోలేదు! మీకోసం, సరదాగా, తెలుగు మాష్టారిని ఆట పట్టించే కోతి శిష్యుడిగా:
    శంకరయ్య గారు చకచకా జెప్పెరా
    జిన్ను వోడ్క తళుకు జిలుగు లెల్ల
    టక్కు లాడిచుక్క టకిలమీద మనసు
    మందు జనుల కెల్ల విందు గాదె!
    (బెమ్మ కైన పుట్టు రిమ్మ తెగులు)

    రిప్లయితొలగించండి
  5. రేటుకు మించిన పైకము
    సీటుకు చెల్లించి యెగ్గు సిగ్గులు లేకన్
    పూటకు సారా పొట్లము,
    ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమనేతల్!

    రిప్లయితొలగించండి
  6. చంద్రశేఖర్ చెప్పారు...
    హమ్మయ్య, "ర్భ" ప్రాసతో నేనే ముందుగా పోస్టు చేస్తానో లేదో అనుకొన్నాను. పరీక్షిత్తు శిశువుగా వున్నప్పుడు, ఉత్తర గర్భంలో అశ్వత్థామ బ్రహ్మశిరో నామ బాణ ఘాతములకు ఆవేదన చెంది,

    అర్భకుడుహడలి యుత్తర
    గర్భమునందుండి వేడ కమలాక్షుండా
    విర్భవ ముచెంది కావగ
    గర్భమందు బిడ్డ గంతు లిడెను.

    రిప్లయితొలగించండి
  7. కలిమిఁ గలిగించు కలకంఠి; కంటినీరు
    నొత్తు కష్టనష్టముల కోర్చుకొని, కాన
    కలహకంఠులు దప్ప కలకంఠు లిలను
    లేరు శివ ! కాలమవ్వారి తీరు బోవు !

    రిప్లయితొలగించండి
  8. శార్జ్గ పాణి కిడగ శంఖుచ క్రములుండ
    నాల్గు తలలు కూడు నాభిజునకు
    వంకలేనివానికింక సిగన నెల
    వంక బెట్టఁదగును, శంకరునకు!

    రిప్లయితొలగించండి
  9. పండితుండు శక్తి పదగుంభనలఁ జూప
    కవిని పెండ్లియాడి కాంత వగచె
    “చవక మాట లేల సరకులేదా”యంచు
    పాల బుడ్డి దెచ్చి, పాన్పు నెక్కి!
    సూచన: కవి=పండితుడు అనే అర్థంలో.
    కవిని పెండ్లియాడి కాంత వగచె

    రిప్లయితొలగించండి
  10. పూజలొసఁగునే మోక్షము పొత్తు విడక
    దానమొసఁగునే ఫలములు దయ విడచిన
    నేతిబీరకాయ పగిదిన్ నేర్చినట్టి
    విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక!

    రిప్లయితొలగించండి